ఎంత పనిచేసావ్ ..సమంత...! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత పనిచేసావ్ ..సమంత…!

August 14, 2017

ఎవలన్న హీరో,హీరోయిన్లు  షాష్ ఓపెనింగ్ చేస్తున్రని తెలిస్తే సాలు ఇగ ఆడ పబ్లిక్ రష్  సూడాలే  నాసామిరంగ…జాతర లెక్కనే ఉంటది. ఈరోజు ఎల్బీనగర్ ఎల్ పి టి మార్కెట్ కు సమంత అస్తుందని తెల్శినంక ఊకుంటరా,ముందే పెద్ద హీరోయిన్ ఆయే..మల్లా తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఆయే,హీరోయిన్ ను  సూద్దామని,అటు పబ్లిక్.. హీరోయిన్ టిక్క టిక్క ఫోటోలు దించి,ఆ ప్రోగ్రాంను కవర్ చేద్దామని.. మీడియా ప్రతినిధులు బాగనే పోయిన్రట, ఇగ హీరోయిన్ సుట్టు ఉన్న బౌన్సర్లు ఊకుంటారా,ఎవ్వలని సూడకంట ఆళ్ల ప్రతాపమేందో సూపిస్తరు.సమంత బౌన్సర్లు పబ్లిక్ ను నూకేస్కుంట, రిపోర్టర్ల సెల్ఫోన్స్ ,కెమెరాలు గుంజుకుంట  ఆగమాగం జేశిన్రట.అంతేకాదు మీడియా వాళ్లు ఇక్కడినుంచి వెళ్లిపోవాలె అని  గుడ్లు పెద్దయ్ జేస్కంట సమంత బౌన్సర్స్ బెదిరించిన్రట.

అవుమల్లా బెదిరియ్యాల్సిందే సెలెబ్రిటీలు ఎక్కడికెళ్లినా  ఉరుకులు పరుగులు తీస్తూ, జనాల్లో ముప్పు తిప్పలు పడుతూ…న్యూస్ కవర్ చేసే ఆళ్లను టీవీలల్ల,పేపర్ లల్ల సూపిచ్చే మీడియావాళ్లపై  విరుచుకుపడాల్సిందే.పబ్లిక్ మీద ,మీడియా మీద ఇంత మర్యాద జూపిచ్చే యాక్టర్లు ,యాక్టరమ్మలు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మంచిది..మీరు సెలెబ్రిటీలు కానీకి,మీకు ఈ  స్టేటస్ రానీకి  ఆ పబ్లిక్కు,ఆ మీడియా వాళ్లే కారణమని గుర్తుపెట్టుకుంటే మంచిది.