Home > Featured > అంత డెలికేట్ గా ఏమీ లేను-మజిల్స్ చూపిస్తూ సమంత పోస్ట్

అంత డెలికేట్ గా ఏమీ లేను-మజిల్స్ చూపిస్తూ సమంత పోస్ట్

samantha shows her muscles and says that not so delicate

అరుదైన కండరాల వ్యాధి ‘మయోసైటిస్’ బారినపడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య ఇంటికే పరిమితమైంది. తన సినిమాల షూటింగ్స్‌కు కూడా బ్రేక్ ఇచ్చేసింది. సమంత లాస్ట్ మూవీ యశోద. తన నెక్ట్స్ మూవీ ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ట్రైలర్ మూవీ ఈవెంట్‌లో సమంత అప్పియరెన్స్‌పై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వినిపించాయి. ఫేస్‌లో మునుపటి గ్లో కోల్పోయిందని, వీక్‌ గా తయారైందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో మజిల్స్ చూపిస్తూ కొత్త ఫొటోలు షేర్ చేసింది.

తాను బలహీనంగా మారినట్లు ఒక న్యూస్ పోర్టల్ నెగెటివ్ కామెంట్ పోస్టు చేయగా.. సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తను జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తున్న ఫొటోను తాజాగా పోస్ట్ చేసింది. తను అద్దం ముందు నిలబడి కండలు ప్రదర్శిస్తుండగా.. ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్ ఈ పిక్ తీసారు. ఇందులో పింక్, బ్రౌన్ టాప్ ధరించి ఉన్న సామ్ తన మజిల్స్ చూపిస్తూ.. ‘అంత డెలికే‌ట్‌గా ఏం లేదు’ అని క్యాప్షన్ జోడించింది.

సమంత శాకుంతలం ట్రైలర్ ఈమధ్యనే విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది కూడా. ఫిబ్రవరి 17న హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండతో సామ్ జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ ఆమె అనారోగ్యం కారణంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.

Updated : 17 Jan 2023 10:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top