ఎదగండయ్యా, పోయి పని చూసుకోండయ్యా.. ట్రోలింగ్‌పై సమంత - MicTv.in - Telugu News
mictv telugu

ఎదగండయ్యా, పోయి పని చూసుకోండయ్యా.. ట్రోలింగ్‌పై సమంత

June 21, 2022

ఇటీవల ఎన్నో సినిమా జంటలు విడిపోయాయి. అయితే సమత, నాగచైతన్య జంటపై జనం, మీడియా ఎక్కువ ఫోకస్ చేశారు. సామ్ లైమ్‌లైట్లో ఉండడమే దీనికి కారణం. విడాకులు తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత ఈ జంట ఏం మాట్లాడినా వార్తయి కూర్చుంది, కూర్చుంటోంది. ఇద్దరూ కూడా సోషల్ మీడియాలోనో, ఇంటర్వ్యూలో తెలిసో తెలియకో పుసుక్కకున ఏదో ఒకటి అనేసి వేడిని కొనసాగిస్తున్నారు. విడిపోవడానికి వీరిలో ఎవరి తప్పు అనే చర్చ సినీ అభిమానులు నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరోపక్క విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.  నాగచైతన్యను బ్లేమ్ చేయడానికి సమంతే ఓ టీమ్ ను పెట్టి ఈ పుకార్లు పుట్టింస్తోందని అని  ఫ్యాన్స్‌ అంటున్నారు.  దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. అమ్మాయిలను బ్లేమ్ చేయడం మానుకోవాలంటూ ‘ఎదగండయ్యా బాబూ..’ అని దులిపేసింది.

పెళ్లి పెటాకులు కావడానికి సమంతే కారణమని తనపై చేస్తున్న ఆరోపణలు ఆమె తీవ్రంగా ఖండించింది. ‘‘అమ్మాయిలపై పుకార్ల వస్తే నిజమని నమ్మేస్తారు. అబ్బాయిపై వస్తే మాత్రం అమ్మాయే కల్పించిందని అంటారు. ఇప్పటికైనా ఎదగండి. మేమిద్దం పాత విషయాలు మర్చిపోయి మా పని మేం చేసుకుంటున్నాం. మీరు కూడా అలాగే ముందుకెళ్లండి. మీ పనిపై, మీకుటుంబంపై దృష్టి సారించండి..’’ అని ఆమె ట్వీట్ చేసింది.