Samantha starrer Shaakuntalam movie will release on April 14
mictv telugu

సమంత శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

February 10, 2023

Samantha starrer Shaakuntalam movie will release on April 14

స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తొలుత ఫిబ్రవరి 17న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత అనుకోకుండా వాయిదా పడింది. తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు నిర్మాతలు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక ప్రేమకావ్యాన్ని దృశ్యకావ్యంగా మలిచారని, సమంత అభినయం ఆకట్టుకుంటుందని వివరించారు. అటు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, విజువల్స్ గ్రాండ్ గా ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించడం విశేషం. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందిస్తున్న సంగీతం ప్రధాన బలంగా చెప్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.