అక్కినేని కుటుంబానికి చుక్కలు చూపిస్తున్న సమంత.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్కినేని కుటుంబానికి చుక్కలు చూపిస్తున్న సమంత..

November 14, 2022

సమంత కెరీర్ లో ఎప్పుడు లేనంతగా దూసుకెళ్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో సమంత స్టార్ తిరిగిపోయింది. ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా భర్త చైతుతో గొడవలకు కారణమని రూమర్స్ కూడా ఉన్నాయి. అయినా అవేవి పట్టించుకోకుండా నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేసి మరి నచ్చిన చిత్రం చేస్తూ ముందుకెళ్తుంది సమంత. తెలుగు, తమిళం, కన్నడ , హిందీ అన్ని భాషల్లో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది. ఇప్పుడు స్టార్ హీరోలకి సమానంగా సమంత మార్కెట్ పెరిగిపోయింది. దీంతో సమంతతో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలని సైతం తీయడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా.. సుమారుగా 40కోట్ల భారీ బడ్జెట్ తో యశోద తెరకెక్కింది. ఇది నాగార్జున మూవీ మార్కెట్ కంటే ఎక్కువ. ఇక 55కోట్ల మేర బిజినెస్ సైతం యశోదకి జరగటం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. ఇండియాలో ఏ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ఇంత భారీ బిజినెస్ జరగలేదు.

అయితే ప్రస్తుతం అక్కినేని – సమంత అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ నేపథ్యంలో ఈ సమంత సంచలన రికార్డులని అక్కినేని హీరోలకి కౌంటర్ గా వాడుకుంటున్నారు. “యశోద” సినిమా కలెక్షన్ల ను అభిమానులు అక్కినేని హీరో ల సినిమా కలెక్షన్ల తో కంపేర్ చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో యశోద 19 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, తొమ్మిది కోట్ల‌కుపైగా షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఈ కలెక్షన్లు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ సినిమాల కంటే చాలా ఎక్కువ అంటున్నారు. చైతు “థాంక్ యూ”, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు అయితే యశోద కలెక్షన్స్ దరిదాపుల్లో కూడా లేవని ట్రోల్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీని ఏలుతున్నఅతి ముఖ్యమైన కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఫ్యామిలి హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాలకు లేని క్రేజ్, మార్కెట్ సమంతకి ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.