సమంతకి షాక్ ఇస్తున్న.. యశోద కలెక్షన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సమంతకి షాక్ ఇస్తున్న.. యశోద కలెక్షన్స్

November 12, 2022

samantha yashoda movie box office collection

సమంతా లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకోగా… క్రిటిక్స్ నుండి సైతం పాజిటివ్ రివ్యూలను అందుకుంది. కథలోని సస్పెన్స్ కి ప్రేక్షకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. యువ దర్శకులు హరి, హరీష్ లు కథలో ఊహించని మలుపులతో ఆడియన్ ని ఆకట్టుకోవడంతో యశోద కలెక్షన్స్ కూడా బాగేనే వచ్చాయి. సినిమా ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా నివేదిక ప్రకారం 55 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ని చేసింది యశోద. దీంతో 55కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగిన యశోద.. నవంబర్ 11 శుక్రవారం రోజు తెలుగు రాష్ట్రాల్లో 29.98 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉండగా, హిందీలో 6.39 శాతం ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా యశోద 3.01 కోట్ల షేర్స్ వసూల్ చేసినట్టు తెలుస్తుంది. అవినీతి వైద్య ప్రపంచంలోని రహస్యాలను తెలుసుకునే అద్దె తల్లి పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. నైజాంలో రూ.84 ల‌క్ష‌లు, సీడెడ్ రూ.18 ల‌క్ష‌లు, ఆంధ్ర‌లో రూ.68 ల‌క్ష‌లు రాగ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.70 కోట్లు షేర్‌ వ‌చ్చింది. దీన్ని గ్రాస్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే.. రూ. 2.80 కోట్లు.

ఇక త‌మిళ‌నాడులో 16 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 ల‌క్ష‌లు, ఓవ‌ర్ సీస్‌లో రూ.90 ల‌క్ష‌లు వ‌చ్చాయి. మొత్తంగా రూ.3.01 కోట్లు షేర్ వ‌సూళ్లను య‌శోద రాబట్టగా.. 5.40 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక చిత్ర యూనిట్ కూడా య‌శోద ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను 6.32 కోట్లగా అధికారిక ప్రకటన చేసింది. అయితే మొదటిరోజు ఫిగర్స్ బాగున్నా.. సమంత ఊహించిన కలెక్షన్స్ మాత్రం ఇవి కాదంటున్నారు క్రిటిక్స్.
రేపు ఎల్లుండి వీకెండ్ కలిపితే మాక్సిమమ్ మరో 10కోట్లు రావొచ్చు. సినిమాకి వచ్చిన టాక్ ప్రకారం ఫస్ట్ వీకెండ్ తరువాత నెమ్మదిగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తాయి. ఈ లెక్కన సమంత యశోద ఓవర్ ఆల్ గా పాతిక కోట్లు కలెక్ట్ చేస్తే మహా ఎక్కువంటున్నారు. కానీ యశోద 55కోట్ల బిజినెస్ చేసింది. 5కోట్లు దాటితేనే యశోదని హిట్ మూవీగా పరిగణించొచ్చు.