samantha yashoda movie review
mictv telugu

యశోద బెడిసికొట్టిందా ?

November 11, 2022

సమంత చాలా ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం యశోద. విడాకుల తరువాత కెరీర్ బెస్ట్ ఫార్మ్ లో ఉన్న సామ్ హీరోలతో పోటీ పడి మరి యశోదతో యాక్షన్ జోనర్ ఎంచుకుంది. స్టార్ హీరోల మార్కెట్ కి ధీటుగా 40కోట్ల బిజినెస్ జరిగిన ఈ యశోద మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాని సమంత చాలా వినూత్నంగా ప్రచారాం చేసింది. యశోద కంటెంట్ కంటే ఎక్కువగా.. వ్యక్తిగతంగా సింపతీ వచ్చేలా తన అనారోగ్యాన్ని పూర్తిగా ప్రమోషన్స్ లో వాడుకుంది సమంత. దీంతో యశోదకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. సెలైన్ బాటిల్ తో యశోదకి డబ్బింగ్ చెప్పిన ఫోటోతో మొదలైన సింపతీ వేవ్.. సుమ ముందు సమంత కన్నీళ్ల ఇంటర్వ్యూతో మరింత పైకి ఎగిసింది. అయితే ఈ సింపతీ వేవే యశోదకి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయని అంటున్నారు. భారీ అంచనాలకు అనుగుణంగానే థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. సినిమా బావుందని కూడా పబ్లిక్ టాక్ వచ్చేసింది. అయితే మరి కలెక్షన్స్ కొల్లగొడుతుందా అంటే మాత్రం డౌటే అంటున్నారు క్రిటిక్స్.

ఎందుకంటే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ వంటి మెగా మూవీనే బ్రేక్ ఈవెన్ కాలేక బాక్సాఫీస్ దెగ్గర బోల్తా కొట్టింది. మరి ఈ నేపథ్యంలో సమంత యశోదకి లాభాలు రావాలంటే.. కాంతార రేంజిలో బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. అప్పుడు కానీ 40కోట్ల బ్రేక్ ఈవెన్ క్రాస్ కాదు. కానీ ఇక్కడ ఆ స్థాయిలో మాత్రం యశోదకి టాక్ రాలేదంటున్నారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో మరో సరికొత్త పాయింట్ ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్, అందం మీద జరిగే వ్యాపారం ఎలా ఉంటుందో యశోదలో చూపించారు. కానీ తెర మీదకు వచ్చే సరికి ఎన్నో సీన్లు లాజిక్‌కు దూరంగా ఉన్నాయని టాక్. సమంత సింగిల్ గా సినిమాని లాక్కొచ్చినా కలెక్షన్స్ కష్టమే అంటున్నారు. ఫస్ట్ హాఫ్ నిరాశ కలిగించినా.. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుందని.. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగుంటాయని అంటున్నారు. యశోద రియాల్టీ బయటకు వచ్చే సీన్ బాగుంటుంది. కానీ అది మనం ఇది వరకు చూసినట్టుగానే అనిపిస్తుంది. పోకిరి తరహాలో కనిపిస్తుందని పబ్లిక్ టాక్. ఇలా సినిమాకు ఎన్ని పాజిటీవ్ అంశాలున్నా.. భారీ బడ్జెట్ కారణంగా యశోద బ్రేక్ ఈవెన్ కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.