టాలీవుడ్లోకి ‘ఏమాయ చేసావే’ సినిమాతో అడుగుపెట్టి, కుర్రకారును తన అందంతో, నటనతో కట్టిపడేసిన ప్రముఖ హీరోయిన్ సమంత, ఒక హోటల్లో ఎనిమిది గంటలపాటు పనిచేశానని షాకింగ్ విషయాన్ని తెలిపింది. తాజాగా సమంత సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చింది. దాంతో ఓ నెటిజన్ ఆమె స్టైల్, ఫుడ్, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ‘సమంత గారు మీ మొదటి ఉద్యోగం ఎక్కడ చేశారు?, జీతం ఎంత తీసుకున్నారో? ఆ విషయాలు చెప్పండి’ అని అడిగాడు. దానికి సమంత నవ్వుతూ, అసలు విషయం చెప్పేసింది.
”నా మొదటి జీతం రూ. 500. అది ఒక హోటల్లో అనుకుంటా. మాస్టెస్గా దాదాపు ఎనిమిది గంటలపాటు పనిచేశాను. ఆ సమయంలో నాకు రూ. 500 ఇచ్చారు. ఈ ఉద్యోగం 10వ తరగతి చదువుతున్నప్పుడో, 11వ తరగతి చదువుతున్నప్పుడో చేశాను” అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మరోపక్క సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం..సినిమాలపై, కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం సమంత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రెండవ హీరోయిన్గా టాప్‌లో నిలిచింది. ఒక్కోక్క సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రస్సో బ్రదర్స్, సిటాడెల్ చిత్రంతో సమంత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ చిత్రనిర్మాత ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించనున్నాడు.
Her first income was Rs . 500 at 10 th std @Samanthaprabhu2 comes long way ❤️❤️ #SamanthaRuthPrabhu pic.twitter.com/2bBp2fLT8J
— Dhanam 🌹 (@dhanam_arjuner) April 21, 2022