Samantha's hot photo shoot is going viral in North
mictv telugu

సమంత హాట్ వీడియో.. నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్

November 24, 2022

యశోద సినిమాతో హిట్ కొట్టిన సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. అంతకు ముందు వచ్చిన రూమర్లను నిజం చేస్తూ చిత్ర విడుదల సమయంలో తనకు ఈ రుగ్మత ఉందని స్వయంగా సమంతే వెల్లడించింది. మొదట ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్ తర్వాత అభిమానంతో గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సౌత్ లో మంచి నటిగా పేరు పొందిన సమంత.. ఉత్తరాదిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో బోల్డ్ యాక్టింగ్ తో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. పుష్ప సినిమాలోని ప్రత్యేక పాటతో బాగా పాపులర్ అయి ఒక్కసారిగా అక్కడి ప్రేక్షకులతో పాటు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Star Frames (@starframesofficial)

ఈ నేపథ్యంలో సమంత గతంలో చేసిన హాట్ ఫోటో షూట్ లు, బికినీ వీడియోలను మరోసారి ట్రెండింగులో నిలుపుతున్నాయి. నాగచైతన్యతో వివాహం నుంచి విడాకులు, కెరీర్, కాఫీ విత్ కరణ్ షో, యశోద, మయోసైటిస్ వ్యాధి వరకు ఆమెకు సంబంధించిన అంశాలను మరోసారి స్పృశిస్తున్నాయి. బ్లాక్ బర్బెరీ బికినీలో టోన్డ్ మిడ్ రిఫ్ ను ప్రదర్శిస్తున్న ఆమె హాట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఓపెన్ డ్రెస్, పెదవులపై గులాబీ రంగుతో పూర్తి భిన్నంగా కనిపించిన సమంతను ఇష్టపడుతున్నారు నార్త్ ప్రేక్షకులు. ఆమో తాజా ఆరోగ్య పరిస్థితి తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.