అప్పుడు లేని ధైర్యం ఇప్పుడుంది, ఏదైనా చేసేస్తా.. సమంత - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడు లేని ధైర్యం ఇప్పుడుంది, ఏదైనా చేసేస్తా.. సమంత

May 7, 2022

హీరోయిన్‌ సమంత కేక పెట్టిస్తోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే… మరో పక్క సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. పీకాక్ అనే ప్రముఖ మ్యాగజైన్‌ కోసం స్టన్నింగ్‌ ఫోజులిచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘నా స్కిన్‌టోన్‌తో నేను కంఫర్టబుల్‌గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది. కానీ చాలా సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్‌ కానీ హార్డ్‌ కోర్‌ యాక్షన్‌ సహా ఢిపరెంట్‌ రోల్స్‌ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు. కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది’ అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్‌ లేటెస్ట్‌ ఫోటోలపై హీరోయిన్‌ తమన్నా కూడా రియాక్ట్ అయింది. బ్యూటీ అంటూ సమంతను పొగిడింది.