Samantha's 'Sakunthalam' is here..Here is the poster
mictv telugu

‘శాకుంతలం’ అప్డేట్ వచ్చేసింది..పోస్టర్‌ ఇదిగో

September 23, 2022

టాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు ‘జెస్సీ’గా పరిచయమై, ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి తదితర సినిమాల్లో కథనాయికగా నటించి, తన అందంతో, నటనతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చేరిగిపోని ముద్రవేసుకున్నారు నటి సమంత. తాజాగా ఆమె టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, పలు ప్రాజెక్ట్‌లతో బీజీబీజీగా ఉన్నారు.

ఈ క్రమంలో చాలా రోజులుగా సమంత అభిమానులు శాకుంతలం సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈరోజు శాకుంతలం చిత్ర బృందం అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. కాసేపటిక్రితమే…శాకుంతలం సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

”శాకుంతలం’ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాము. ‘శాకుంతలం’ నుంచి ఈరోజు ఈ కొత్త ఫొటో, మోషన్ పోస్టర్‌ని అభిమానులతో పంచుకోవటం ఆనందంగా ఉంది”అని చిత్ర బృందం తెలియజేసింది.

”మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథని ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గుణశేఖర్. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది.”