ఇతిహాసంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గుణశేఖర్. సమంత హీరోయిన్గా ఆయన తీసిన ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కాసేపటి క్రితం విడుదల చేశారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ కంటే కూడా దుర్వాస మునిగా మోహన్ బాబు అదరగొట్టారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివిగా గల ఆ ట్రైలర్లో మోహన్ బాబు డైలాగ్ మాత్రమే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మిగతా నటీనటులు పర్వాలేదు.
ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మణిశర్మ సంగీతం అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ కూడా అదిరపోయాయి. ఇక చివర్లో అల్లు అర్హ ఎంట్రీ మాత్రం విజిల్స్ వేసేలా ఉన్నాయి. సింహం మీద అలా అల్లు అర్హ ఎంట్రీ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు.