శ్రీవారి సేవలో సమంత - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి సేవలో సమంత

May 20, 2017

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొంది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్వల్పంగా తోపులాట జరిగింది. అటు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌, ఏపీ జలవనరులు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు.