సామాన్య జీవన శాస్త్రం 5వ ప్రదర్శన - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్య జీవన శాస్త్రం 5వ ప్రదర్శన

August 21, 2017
హైదరాబాదు, మణికొండ, ఓయు కాలనీలోని ‘ సామాన్య శాస్త్రం ’ ఇప్పుడు ఒక దర్శనీయ జాగ. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగినా జీవితానికి సరిపడా ఎన్నో సత్యాలు తెలుస్తాయి. ఎందరో సామాన్య జీవితాలను ఫోటోల ద్వారా వీక్షించవచ్చు. మనకు తెలియని ఎన్నో జీవితాల్లోని విభిన్న కోణాలు కనిపిస్తాయిక్కడ. దీనికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేశ్ బాబు కృషి హర్షణీయమైంది. సామాన్య శాస్త్రం ఆర్ట్ గ్యాలరీలో‘ the ordinaryness of truth ’ పేరిట 5 వ ప్రదర్శన జరిగింది. ఈ విశిష్ఠ ప్రదర్శనకు సామాన్యులే ముఖ్య అతిథులు. దోస్తులే ఆత్మీయ మహారథులు.
‘‘ మనం ఏదో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సత్యాన్ని అన్వేషించడం కాదు మన నిత్య జీవితంలో మన పరిసరాల్లోనే జీవిత సత్యం తారస పడుతుంది. దైనందిన జీవితంలోని సత్యాన్ని సందర్శించడమే ఈ ప్రదర్శన ముఖ్య వుద్దేశం. అలాగే ఒక అన్వేషణ కోసం ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటారు. మన కళ్ళ ముందున్న సత్యాన్ని మనం నిరాకరించి ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటాం. హైదరాబాదులోని సామాన్యుడి జీవితాన్ని
నిరంతరంగా ప్రదర్శనకు పెట్టి జీవితం కూడా గొప్పదే అని నిరూపించే ప్రయత్నమే ఈ గ్యాలరీ ముఖ్య ఉద్దేశం ’’ అని అంటున్నారు
ఫోటో గ్రాఫర్ కందుకూరి రమేశ్ బాబు.
ప్రదర్శన వేళలు ప్రతిరోజూ సాయంత్రం 5:30 గం ల నుండి రాత్రి 10:00 గం ల వరకు వుంటుంది.
ఆదివారం ఉదయం 11:00 గం ల నుండి రాత్రి 9:00 గం ల వరకు వుంటుంది.
పగటి పూట చూడాలనుకుంటే ఫోన్ 9948077893 నెంబరుకి కాల్ చేసి రమేశ్ బాబుతో మాట్లాడి చూడవచ్చు.