Everyday WOMEN – ‘ సామాన్యశాస్త్రం ’ ప్రదర్శన - MicTv.in - Telugu News
mictv telugu

Everyday WOMEN – ‘ సామాన్యశాస్త్రం ’ ప్రదర్శన

March 8, 2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్‌లోని సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీలో  ‘ Everyday WOMEN ’ పేరిట ఛాయాచిత్ర ప్రదర్శన మొదలైంది. 6వ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఈ కర్యక్రమం ప్రారంభమైంది. నెల రోజుల పాటు అత్యంత అట్టహాసంగా ఈ ఛాయాచిత్ర ప్రదర్శన జరగనుంది.‘ అటు అభివృద్ధి ఇటు ప్రగతి ఈ రెండు సామాన్య జీవితాల మీద ప్రభావం చూపుతాయి.  ప్రచార, ప్రసార మాధ్యమాలు వీటి తాలూకు వార్తలు, కథనాలు, చిత్రాలనే అధికంగా ప్రాచుర్యంలోకి తెస్తుంటాయి.నిజానికి సుప్రసిద్ధం కావాల్సింది వాటికి అతీతంగా మెజారిటీ ప్రజల జీవితం. అది ఇంకా సామాన్యంగానే వుంది.  మహిళల జీవితాలు పెద్దగా మారనేలేదు. అనాధిగా వారి జీవితం, సుఖశాంతుల స్థితీగతీ అలాగే వుంది. అయినా మహిళ భూదేవి. ఆమె ఓ గొప్ప చిత్రం. తన సంతోషం, వేదన, సహచర్యం, ఆత్మశాంతి ఇవన్నీ మనం సన్నిహితంగా చూడవలసి వుంది. ఆ దిశలోనే ప్రత్యేకంగా మహిళా ఛాయాచిత్ర ప్రదర్శనకు పూనుకున్నాను ’ అని సామాన్యశాస్త్రం ఫౌండర్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్ కందుకూరి రమేశ్‌బాబు అన్నారు.గ్యాలరీ వేళలు : ప్రతిరోజూ సాయంత్రం 5.3౦ నుంచి 8 వరకు. ఆదివారాలు11 నుంచి సాయంత్రం 6 వరకు.

గ్యాలరీ గూగుల్ మ్యాప్ :

https://www.google.co.in/maps/place/Samanyashastram+Gallery/@17.4082332,78.3917983,17z/dat

a=!3m1!4b1!4m5!3m4!1s0x3bcb96a51eece6fd:0x5365135806474af6!8m2!3d17.4082332!4d78.39

3987?dcr=0