ఒకే నంబర్‌తో రెండు కార్లు.. చలానా చూసి అవాక్కైన డాక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే నంబర్‌తో రెండు కార్లు.. చలానా చూసి అవాక్కైన డాక్టర్

February 18, 2020

cfbcb

మనిషిని పోలిన మనుషులు ఉంటారనేది చాలా మందికి తెలుసు. ఇది చాలా సార్లు నిజం కూడా అయింది. కానీ ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉండటం అసాధ్యం. కానీ ఇది హైదరాబాద్‌లో నిజంగానే సాధ్యమైంది. రెండు కార్లు ఒకే నంబర్‌తో రోడ్లపై దర్జాగా తిరుగుతున్నాయి. ఇటీవల ట్రాఫిక్ చలానా విధించడంతో అసలు యజమానికి ఈ విషయం తెలిసి షాక్ అయింది. ఆ కారు తనది కాదు బాబోయ్.. ఎవరో తన నంబర్ వాడుతున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. 

హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న కే. వనజా రఘునందన్ అనే మహిళకు TS 09EL 5679 ఆరెంజ్‌ కలర్‌ హోండా జాజ్‌ కారు ఉంది. ఈ కారుపై ఇటీవల పోలీసులు ఓవర్ స్పీడ్ పేరిట చాక్లెట్ కలర్ ఓల్వో కారుకు చలానా విధించారు. దాన్ని చూసుకున్న ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆ కారుకు ఉన్న నంబర్ తనదేనని, కానీ కారు మాత్రం కాదని గ్రహించింది. వెంటనే పోలీసులను కలిసి అసలు విషయం చెప్పింది. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినట్లు ఛలానా పడిందని కానీ తాను అటు వైపు వెళ్లనే లేదని చెప్పింది. దీంతో ఆ కారును ఓవరో దుండగులు తప్పుడు నంబర్ ప్లేటుతో వాడుతున్నారని గ్రహించి గాలింపు చేపట్టారు. ఇంతకీ ఆ కారులో తిరుగుతున్నది ఎవరు, ఎందుకు తప్పుడు నంబర్ ప్లేట్ పెట్టారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా డాక్టర్ మాత్రం ఆ కారుతో తనకు సంబంధం లేదని, భవిష్యత్‌లో వారిని నుంచి తనకు ప్రమాదం  కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.