‘సమ్మోహనం’ నటుడు మృతి! సుధీర్ ట్వీట్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘సమ్మోహనం’ నటుడు మృతి! సుధీర్ ట్వీట్..

July 10, 2019

విజయం సాధించిన ‘సమ్మోహనం’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు అమిత్ పురోహిత్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. అయితే అమిత్ మరణంపై అధికారిక వార్తలేవీ రాలేదు. సమ్మోహనం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా అమిత్ కు నివాళి అర్పించారు.

 

అమిత్ మరణం తనకు దిగ్భ్రాంతి కగిలిచిందని సుధీర్ పేర్కొన్నారు. ‘‘సమ్మోహనం’ సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ చాలా స్నేహంగా ఉండేవాడు. ప్రతి షాట్‌కు 100 శాతం న్యాయం చేసేవాడు. ప్రతిభగల నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు…’ అని అన్నారు. అమిత్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని మోహనకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్‌ ఎంతో వినయం, నిబద్ధత, నైపుణ్యం కలిగిన నటుడని, అతనితో మరో సినిమా చేద్దామనుకున్నానని తెలిపారు. అమిత్ ‘సమ్మోహనం’లో హీరోయిన్ అదితిరావు హైదరికి మాజీ ప్రియుడిగా నటించాడు. హిందీలో ‘పంక్‌’, ‘ఆలాప్‌’ చిత్రాలు అతనికి పేరు తెచ్చాయి.