మామ పోస్టర్ కోడలి చేత్తో..! - MicTv.in - Telugu News
mictv telugu

మామ పోస్టర్ కోడలి చేత్తో..!

August 29, 2017

అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు సమంత. ఆమె  తన మామ నాగార్జున నటించిన ‘రాజుగారి గది 2’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశింది. ఈ రోజు  మన్మథుడి పుట్టిన రోజు ఈ సందర్బంగా ఈ పోస్టర్ ను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు. అంతేకాదు తన మామ గురించి పొగుడుతూ సమంత  ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చింది. ‘ఆయన రాజే ఎందుకంటే.. తనను తాను ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నా మామ గొప్పగా తయారవుతున్నారు’ అని ట్వీట్టర్లో రాసింది. దీనికి నాగార్జున స్పందిస్తూ  ‘ధన్యవాదాలు ప్రియమైన కోడలా.. యు ఆర్‌ ది బెస్ట్‌’ అని రీ-ట్వీట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లో నాగార్జున చేతిలో రుద్రాక్షమాలను పట్టుకుని, చాలా యంగ్‌గా కనిపించారు.ఆ సినిమా ముచ్చట ఏమోగనీ మామ, కోడళ్ల  ట్విట్లు చూసినోళ్లంత…మామకు తగ్గ కోడలు..కోడలుకు తగ్గ మామ అని పొగుడుతూ  లైకులు ,కామెంట్లతో పొగిడేస్తున్నారు.