చేనేత వస్ర్తాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అక్కినేని కోడలు సమంత గురువారం దుబ్బాకలో సందడి చేసింది. దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఆసక్తిగా పరిశీలించింది. అంతేకాదు అక్కడున్న చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మనదేశంలో కంటే విదేశాల్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ‘చేనేత కార్మికులకు మనమందరం అండగా నిలవాలి. చేనేతను మరింత బలోపేతం చేసేందుకు నావంతు కృషి చేస్తాను’ అని చెప్పింది సమంత. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేనేత వస్త్రాలకు మంచి గుర్తింపు వచ్చిందని సమంత అన్నది.