Home > Featured > సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం

Sampark Kranti Express.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దర్భంగా - న్యూఢిల్లీ వెళ్తుండగా ఎస్-6 బోగీకి బుధవారం రాత్రి 8 గంటలకు మంటలు అంటుకున్నాయి. వాటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమై బోగీని వేరుచేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బోగీలో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదని గుర్తించారు. ఎవరైన ఆకతాయిలు కావాలనే మంట పెట్టారా..లేదా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో బోగి పూర్తిగా దగ్ధమైపోయింది.

Updated : 4 Sep 2019 9:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top