హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు విరాళాలు ప్రకటించగా, తాము సైతం అంటూ మరికొందరు ప్రజలకు అండగా ముందుకొస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడంతో ముందుండే బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కూడా సాయం ప్రకటించారు.
హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ. 50 వేలను అందించారు. మంత్రి హరీష్ రావు రావును కలిసి చెక్కు అందించారు. హరీశ్ ఆయనను అభినందించారు. వరద బాధితుల కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతోందని సంపూర్ణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణేశ్కు ఇదివరకు కూడా ప్రకృతి విపత్తుల బాధితులను ఆదుకున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోడానికి లక్ష రూపాయలు ఇచ్చారు. అంతకు ముందు శ్రీకాకుళం వరద బాధితులకు సాయం చరేశారు. ‘హృదయం కాలేయం’ సినిమాతో దుమ్మురేపిన సంపూర్ణేశ్ ‘కొబ్బరిమట్ట’తో అంతగా ఆకట్టుకోలేకపోయారు. కరోనా కారణంగా ఆయన షూటింగ్లకు దూరంగా ఉండిపోయారు.