టీఆర్ఎస్‌లోకి ‘హృదయ కాలేయం’ - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌లోకి ‘హృదయ కాలేయం’

November 24, 2017

‘హృదయ కాలేయం’ సినిమాలో హిట్ కొట్టి, నవ్వులు పూయించిన నటుడు సంపూర్ణేష్ బాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యాడు. వీరిద్దరూ ఆంతరంగికంగా చాలాసేపు మాట్లాడుతుకున్నారు.  తన సినీ కెరీర్‌కు సంబంధించి  తన భవిష్యత్ కార్యాచరణను సంపూ.. సీఎంకు చెప్పాడు. పూర్తి వివరాలు బయటికి రాలేదు. సంపూ కేసీఆర్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యం లభించింది. సంపూ అభిమానులను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ పావులు కదుపుతోందని, అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని ఊహాగానాలు బయల్దేరాయి. సంపూను పార్టీలో చేర్చకుని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.