’హృదయ కాలేయం‘ మూవీలో ప్రియురాలిని బతించుకోవాలని తపనపడే సంపూర్ణేశ్ బాబు నిజజీవితంలోనూ అలాగే తపనపడుతున్నాడు. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడానికి నడుం కడుతున్నాడు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను వరద బాధితులకు సంపూ రూ. 50 వేల విరాళం ప్రకటించాడు. తిత్లీ బాధితులను సినీపరిశ్రమవైపు ఆదుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు.
తాను ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 వేలు అందజేస్తున్నట్టు అతడు తెలిపారు. ‘తిత్లి తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లా చాలా నష్టపోయిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. నా వంతుగా రూ. 50 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నా. మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నా’ అంటూ ట్విట్టర్లో కోరారు. టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఐకాన్‌గా పేరొందిన సంపూర్ణేశ్ తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట’ తర్వలోనే విడుదల కానుంది.
శ్రీకాకుళం జిల్లా #CycloneTitli వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను…..వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను
నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను#SaveSrikakulam pic.twitter.com/hGwpgGTeZI
— Sampoornesh Babu (@sampoornesh) October 13, 2018