వరద బాధితులకు సంపూ సాయం - MicTv.in - Telugu News
mictv telugu

వరద బాధితులకు సంపూ సాయం

August 13, 2019

భారీ వర్షాలకు కన్నడ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇళ్లు కూలిపోయి.. ఉండేందుకు వీలు లేక అవస్థలు పడుతున్నారు. చుట్టూ నీరు నిండిపోవడంతో తినేందుకు తిండి కూడా సరిగా లభించడంలేదు. చాలా మంది దాతలు తమకు తోచినంతగా సాయం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా కన్నడ వాసులకు టాలీవుడ్‌లో బర్నింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తన వంతుగా విరాళం ప్రకటించారు. 

కర్ణాటక వాసుల ఇబ్బందులు చూసి తాను తట్టుకోలేకపోతున్నాని సంపూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వారి కోసం రూ. 2 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. హృదయ కాలెయం సినిమా నుంచి అక్కడి వారు తనను ఎంతో ఆధరిస్తున్నారని చెప్పారు. అందుకే తన వంతుగా సాయం ప్రకటిస్తున్నానని వెల్లడించారు.