మీకు ఏ ప్యాక్ కావాలి.. అభిమానులకు సంపూ ఆఫర్..! - MicTv.in - Telugu News
mictv telugu

మీకు ఏ ప్యాక్ కావాలి.. అభిమానులకు సంపూ ఆఫర్..!

October 28, 2019

తన విచిత్ర నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఓ ముద్ర వేసుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడి పోతున్నారు. బొద్దుగా కనిపించే ఈ నటుడు త్వరలో తీయబోయే తన కొత్త సినిమాలో స్లిమ్‌గా జిమ్ బాడీని చూపించబోతున్నారట. ఇందు కోసం జిమ్‌లో చాలా కష్టపడిపోతున్నాడు.  సంపూ తాజాగా జిమ్ చేస్తున్న వీడియోను ట్వీట్ చేశాడు. ‘మీకు ఏ ప్యాక్ కావాలి’ అంటూ తన అభిమానులను అడుగుతూ దాన్ని షేర్ చేశాడు. 

సంపూ చేసిన ట్వీట్‌కు తెగ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అంతా సిక్స్ ప్యాక్ కావాలంటూ రిప్లే ఇస్తున్నారు. ఇప్పటికే హృదయకాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన సంపూ మరోసారి ఎలాంటి ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నారని అంతా చర్చించుకుంటున్నారు. మరి సంపూర్ణేష్ బాబు చేసే హార్డ్ వర్క్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది.. కొత్త గెటప్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి త్వరలోనే ఇప్పటి వరకూ మనం చూసిన సంపూ.. పూర్తిగా మారిపోబోతున్నారన్నమాట.