Home > Featured > కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కి ఫిదా.. సినిమా ఆఫర్ ఇచ్చిన హీరో

కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కి ఫిదా.. సినిమా ఆఫర్ ఇచ్చిన హీరో

కండక్టర్ ఝాన్సీ అంటే టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసిన డ్యాన్సులు వైరల్ అయ్యాయి. ‘చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్టదాన్ని.. చేతిలా అగ్గిపెట్టె దాన్ని’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ను షేక్ చేసింది. గాజువాక ఆర్టీసీ డిపోలో 11 ఏళ్లుగా కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే కుటుంబం కోసం స్టేజీలపై డ్యాన్సులు వేసింది. అలా వచ్చిన డబ్బులతోనే తమ్ముడిని ఎంబీఏ వరకు చదివించింది.

గతంలో ఎన్నో స్టేజీలపైన, వివిధ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేసినా అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో అనుకున్నంత పేరు రాలేదు. కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన పర్ఫార్మెన్స్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈమె డ్యాన్సులను చూసిన హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయిపోయాడు. ఆమె గురించి తెలుసుకొని ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడాడు. అంతేకాక, తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమని ఆఫర్ కూడా ఇచ్చాడు. దీంతో ఝాన్సీ తెగ ఆనందపడిపోతుంది. వెంటనే సినిమా ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. దీంతో ప్రేక్షకులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. ఇన్నేళ్ల కష్టానిక ఆలస్యంగానైనా ఇప్పుడు గుర్తింపు వస్తుందని అంటున్నారు.

Updated : 16 Sep 2022 9:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top