300 కోట్లతో తయారైన అక్షయ్ సినిమా సంపాదించింది ఇంత.. - MicTv.in - Telugu News
mictv telugu

300 కోట్లతో తయారైన అక్షయ్ సినిమా సంపాదించింది ఇంత..

June 23, 2022

సౌత్‌లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటే.. బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ సినిమా ఇటీవల కాలంలో ఇంకా రాలేదు. బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన అక్షయ్ కుమార్ నటించిన సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోయింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ రూ. 300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు.

ఇండియాలో ఈ సినిమా పూర్తి రన్‌లో రూ. 75కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండో సారి షాక్ తగిలినట్లయింది. గతంలో ఆయన నటించిన ‘బచ్చన్ పాండే’ పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. బ్రజ్ భాషకు చెందిన పద్యం ‘పృథ్వీరాజ్ రాసో’ ను ఆధారంగా చేసుకుని ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ను తెరకెక్కించారు డైరక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది. ఈ సినిమాలో మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.