ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ ఎక్కువ.. అందుకే నాపై ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ ఎక్కువ.. అందుకే నాపై ఆరోపణలు

February 1, 2018

చోరీ, గృహహింస కేసులో అరెస్టయిన యువనటుడు సామ్రాట్ రెడ్డి తన భార్య హర్షితపై ఎదురుదాడి చేశాడు. తాను డ్రగ్స్ వాడతానని, స్వలింగ సంపర్కుడినని, సైకోనని  ఆమె చేసిన ఆరోపణలు అబద్ధాలని అన్నారు. ‘నేను సినిమాల్లో నటించడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా నాతో సినిమాలు మాన్పించేందుకు కుట్ర పన్నింది’ అని అన్నాడు.సమ్రాట్ రెడ్డి గురువారం బెయిల్‌పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ‘హర్షితకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్ కంటే వారే ఎక్కవ.. ఆమె ఉద్దేశమంతా నేను సినిమాలనుంచి బయటకి రావాలని, ఆమె చెప్పినట్లు వినాలని. కానీ నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.. నేనెందుకు వదులుకుంటాను.. ? నేను సినిమాలు మానేస్తానని పెళ్లి సమయంలో చెప్పాననడం  అబద్ధం.. అలాంటి ఒప్పందమేదీ మా మధ్య లేదు. ఇది కేవలం హర్షిత, ఆమె తల్లిదండ్రుల కుట్రే.. నేను హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నా.. చక్కని అవకాశాలు వస్తున్నాయి. కానీ హర్షితకు ఇష్టం లేదు.. దీంతోపాటు చాలా విషయాల్లో మేం గొడవలు పడ్డాం.. కొన్ని బయటికి చెప్పుకోలేనివి.. ’ అని అన్నారు. హర్షిత ఇంట్లో తాను బంగారం, ఇతర వస్తువులు దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. నిజానికి అది తన సోదరి ఇల్లు, అని తన బట్టలు తెచ్చుకోవడానికే అక్కడికెళ్లానని చెప్పాడు.