డ్రగ్స్ బానిసనైతే పోలీసులకు దొరికేవాడిని కదా.. - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ బానిసనైతే పోలీసులకు దొరికేవాడిని కదా..

January 30, 2018

తన భార్య, అత్తమామలు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని యువనటుడు సామ్రాట్ రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి చెడు అలవాటూ లేదన్నాడు. తాను డ్రగ్స్ వాడి ఉంటే పోలీసులకు దొరికి వుండేవాడిని కదా అని చెప్పుకొచ్చాడు. భార్య హర్షిత ఆరోపణలకు అతడు మంగళవారం సమాధానాలు ఇచ్చాడు.హర్షిత ఇంట్లో కెమెరాలను కోపంతోనే పగలగొట్టాలని, సాక్ష్యాలను మాయం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని సామ్రాట్ చెప్పాడు. ‘నా వస్తువులు నేను తెచ్చుకున్నా.. హర్షితను ఆస్తుల కోసం వేధించలేదు. నేను డ్రగ్స్ తీసుకుంటానని ఆమె చేసిన ఆరోపణ దారుణం. డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు కదా. నాకు నిజంగానే డ్రగ్స్ అలవాటు ఉంటే వారికి దొరికేవాడిని. చాలామంది సినిమావాళ్లు డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. నా పేరు చెప్పలేదు కదా. కనుక ఆరోపణలు అబద్ధం..’ అని చెప్పుకొచ్చాడు. హర్షితో విభేదాలకు కారణం ఒక చిన్న మెసేజ్ అని తెలిపాడు. ఆమెతో విడిపోవాలని అనుకుంటున్నానని, అయితే ఆమె అడిగినంత భరణం చెల్లించే స్తోమత తనకు లేదన్నారు.

సామ్రాట్ సైకో, స్వలింగ సంపర్కుడు, డ్రగ్ బానిస అని హర్షిత, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల కిందట 75 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, అయితే అతడు తమ కుమార్తెను సంతోషపెట్టకుండా వేరే అమ్మాయిలతో, బాయ్ ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నాడని చెబుతున్నారు.