సామ్రాట్‌రెడ్డి ఓ గే.. డ్రగ్స్ తీసుకుంటాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

సామ్రాట్‌రెడ్డి ఓ గే.. డ్రగ్స్ తీసుకుంటాడు..

January 30, 2018

చోరీ కేసులో అరెస్టయిన యువనటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత సంచలన ఆరోపణలు చేశారు. అతడు స్వలింగ సంపర్కుడని, మత్తుపదార్థాలు తీసుకుంటాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశాడన్నారు. కేసు నేపథ్యంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‘సామ్రాట్ రెడ్డికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఇద్దరికీ తెలిసిన కొంతమంది మిత్రుల ద్వారా అతడో గే అని తెలిసింది. షాక్ తిన్నాను. నన్ను బయటికి బాగానే చూసుకునేవాడు. కానీ ఇంటికెళ్లాక ఏడిపించేవాడు. నా ఖర్మ అని బాధపడ్డాను. అయితే అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అందుకే దూరంగా ఉంటున్నా..’ అని తెలిపారు.తన తండ్రికి విలువైన షేర్లు ఉన్నాయని, సామ్రాట్ వాటిని తన పేర రాయించాలని వేధించాడని హర్షిత ఆరోపించారు. ఆ పని చేయనందుకు తనను హిసించాడన్నారు. సామ్రాట్ హక్కాకు బానిస అని, తన తిరుగుళ్లకు, జల్లాసకు డబ్బులు కావాలని తనను వేధించేవాడని పేర్కొన్నారు. సామ్రాట్ రెడ్డి.. పంచాక్షరి, తకిట తకిట, బావా.., దేనికైనా రెడీ తదితర సినిమాల్లో నటించాడు.