కస్టమర్లకు సారీ చెప్పిన శాంసంగ్, వన్‌ప్లస్ - MicTv.in - Telugu News
mictv telugu

కస్టమర్లకు సారీ చెప్పిన శాంసంగ్, వన్‌ప్లస్

March 17, 2022

sam

ప్రముఖ మొబైల్ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్‌లు వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. తమ ఫోన్లలో బ్యాటరీ లైఫ్‌ను, గేమింగ్ సామర్ధ్యాన్ని పెంచడం కోసం యాప్ థ్రెట్లింగ్ చేశామని ఒప్పుకున్నాయి. దీని వల్ల ప్లేస్టోర్‌లోని వివిధ యాప్‌ల పనితీరు తగ్గిపోతుంది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌లోనూ యాప్‌ల పనితీరు బాగా నెమ్మదించాయి. దీంతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సంస్థ చీఫ్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. దీని వల్ల గూగుల్, క్రోమ్, వాట్సాప్, ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, జూమ్ వంటి యాప్‌లు ప్రభావితమయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తున్నామని, గేమ్ బూస్టర్ ల్యాబ్ అనే ఆప్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపింది. మరోవైపు వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రొ ఫోన్లలోనూ ఇదే సమస్య ఉంది. యాప్ థ్రాట్లింగ్ చేశామని ఒప్పుకున్న సంస్థ.. సమస్య పరిష్కారానికి ఆక్సిజన్ ఓఎస్ 12ఓ ‘ఆప్టిమైజ్డ్ మోడ్’ను తీసుకొస్తున్నామని ప్రకటించింది. పై పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సైట్లు శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తప్పించాయి.