Samsung announced Black Friday Sale
mictv telugu

శాంసంగ్ ఫోన్లపై భారీ ఆఫర్లు

November 23, 2022

శాంసంగ్ ఫోన్స్ కొనాలనుకునేవారికి శుభవార్త. బ్లాక్ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు శాంసంగ్ కంపెనీకి చెందిన పలు వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్‌పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది.

రూ.72,999 ప్రారంభ ధర ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22, ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల ధరలు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.60,000 నుంచి అందుబాటులోకి ఉండనున్నాయి.ఈ సేల్‌లో గెలాక్సీ జెడ్ ప్లస్ ఫోన్‌లు కూడా తక్కువ ధరకు రానున్నాయి. రూ.80,999 ప్రారంభ ధర ఉన్న జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 4 లు రూ.67,999 నుంచి లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ రూ. 31,999కు లిస్ట్ అయ్యింది. దీని ఎంఆర్‌పీ రూ. 74,999గా ఉంది.

పాత ఫోన్లను ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. శాంసంగ్ షాప్ యాప్ లేదంటే సమీపంలోని స్టోర్లకు వెళ్లి ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.