రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. కొత్త కొత్త ఫీచర్లతో జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు 5జి అందుబాటులోకి వచ్చేసింది. దానిని దఋష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని కంపెనీలు 5 జీ ఫీచర్లతో కొత్త టెక్నాలజీతో అదిరిపోయే ఫోన్లను మార్కెట్లోకి దించుతున్నారు. శామ్ సంగ్ కూడా ఎఫ్ సిరీస్ కు సంబంధించి మరో న్యూ ఫోన్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది.
గాలక్సీ ఎప్ సిరీస్ లోని అత్యుత్తమ ట్రేడ్‌మార్క్ ఫీచర్లతో Samsung Galaxy F14 5G వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
శామ్ సంగ్ ఎఫ్ 14 5జిలో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోనులో HD+90Hz, అట్రాక్టివ్ 16.72 స్క్రీన్, సోషల్ మీడియా-రెడీ 50MP కెమెరా, 5nm Exynos 1330 ప్రత్యేక ప్రాసెసర్ లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 6000mAh వరకు ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్న శామ్ సంగ్ ఎఫ్ 14 5జి స్మార్ట్‌ఫోన్ సరికొత్త సంచనాలను సృష్టిస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది.
ప్రాసెసర్..
ఏ స్మార్ట్‌ఫోన్లో అయినా ప్రాసెసర్ చాలా కీలకం. ఇది ఫోన్ పనీతీరు సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే Samsung ఈసారి దీనిపై ఫోకస్ పెట్టింది. ఈసారి శామ్ సంగ్ ఎఫ్ 14 5జిలో Segment-Only 5nm Exynos 1330 ప్రాసెసర్‌ను యాడ్ చేసింది. ఈ ప్రాపెసర్ సూపర్ ఫాస్ట్, పవర్ ఎఫెక్టివ్ అని ఇప్పటికే నిరూపించబడింది.
బ్యాటరీ లైఫ్..
ఫోన్ కు బ్యాటరీ చాలా ముఖ్యం. ఎక్కువ మంది కోరుకునేది బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలి, ఫాస్ట్ గా ఛార్జింగ్ కూడా అయిపోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పడు తీసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లో శక్తింతమైన 6000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీని జోడించింది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ రెండురోజుల వరకు వస్తుంది. అంతేకాదు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల వేగంగా ఛార్జ్ కూడా అవుతుంది.ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన నగరాల్లో 5జి వ్చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శామ్ సంగ్ 5nm ప్రాసెసర్ తో 5జి సేవలను అందిస్తోంది.
డిస్ ప్లే:
స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయంలో శామ్ సంగ్ కు తిరుగులేదు. టీవీల్లో కానీ, ఫోన్లలో కానీ దీనికున్న క్లారిటీ మరి దేనికీ ఉండదు. దాన్ని మరింత డెవలప్ చేస్తూ ఈసారి భారీ 16.72cm ఫుల్ HD+90Hz డిస్‌ప్లేను తీసుకొచ్చింది. దీనికి 90Hz ప్యానెల్‌ను జోడించి స్క్రీన్ పనితీరును మరింత వేగవంతం అయ్యేలా చేసింది. ఇందులో Gorilla Glass 5 వర్షన్ ఉండటం వల్ల స్క్రీన్‌కు బలమైన రక్షణ ఉంటుంది. ఒకవేళ ఫోన్ అనుకోకుండా కింద పడిపోయినా వెంటనే పగిలిపోదు.
శామ్ సంగ్ ఎఫ్ 14 5జి ఆండ్రాయిడ్ 13 వర్షన్‌తో రన్ అయ్యే One Core UI5.1తో వస్తోంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెబుతోంది కంపెనీ. Frevolution 5G ఫోన్ అన్ని వయసుల వారిని ఆకర్షిస్తుంది అంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 24వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఫ్లిప్ కార్ట్ లో కానీ, డైరక్ట్ గా శామ్ సంగ్ వెబ్ సైట్ లో కానీ ఈ ఫోన్ ను కొనుక్కోవచ్చును.