ప్రపంచంలోనే తొలి  ఫ్రేమ్‌లెస్‌ టీవీ.. 8కే స్పష్టతతో..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే తొలి  ఫ్రేమ్‌లెస్‌ టీవీ.. 8కే స్పష్టతతో.. 

January 2, 2020

hfbv v

సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫోన్‌తో పాటు టీవీలు కూడా స్మార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే సన్నగా ఉండే ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలను అన్ని టెక్ సంస్థలు తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం  శాంసంగ్‌ మరో అడుగు ముందుకేసి ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్‌ 8కే టీవీనీ త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

ఈ టీవీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంసంగ్‌ ఈ టీవీకి సంబంధించి 8కే సర్టిఫికేషన్‌ను కూడా తీసుకోనుంది. ఈ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 7680 x 4320 పిక్సల్స్‌ 8కె స్క్రీన్‌ రిజల్యూషన్‌, హెచ్‌డీఎంఐ 2.1 ఇమేజ్‌ ట్రాన్స్‌మిషన్‌, వన్‌ కనెక్ట్‌ ఫంక్షన్‌ ఉందనునట్టు సమాచారం. శాంసంగ్‌ ఈ టీవీని జనవరి 6న జరగనున్న కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ప్రదర్శించనుందని తెలిసింది.