దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త ఫోన్‌ను తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. SM-A025G మోడల్ నంబర్‌తో ఈ ఫోన్‌ను గుర్తించారు. దీని వ్యావహారిక పేరు శాంసంగ్ గెలాక్సీ ఏ02ఎస్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.
ఈ ఫోన్లో 3 జీబీ ర్యామ్ ఉండనుందని తెలుస్తోంది. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకు ఈ ఫోన్ తీసుకుని వస్తున్నారని సమాచారం. అలాగే ఈ ఫోన్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ప్రీ ఇంస్టాల్ చేసి రానుంది. ఈ ఫోన్ ధర, ఇండియాకు ఎప్పుడు వస్తుందనే సమాచారం తెలియాల్సి ఉంది.