Home > Featured > రూ.9499కే శాంసంగ్ డ్యూయల్ కెమెరా ఫోన్

రూ.9499కే శాంసంగ్ డ్యూయల్ కెమెరా ఫోన్

SAMSUNG GALAXY A10S..

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్‌' గెలాక్సీ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది. గెలాక్సీ ఏ లైన్‌ స్మార్ట్‌ఫోన్‌కు అధునాతన ఎడిషన్‌గా 'గెలాక్సీ ఏ10ఎస్‌' ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.9,499 నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది. 2జీబీ, 3జీబీ ర్యామ్‌తో రెండు వేరియంట్లలో ఈ మోడల్‌ లభ్యంకానుంది. ఆగస్టు 28 నుంచి రిటైల్‌ స్టోర్స్, శాంసంగ్‌ ఒపెరా హౌస్, ఆన్‌లైన్‌‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

గెలాక్సీ ఏ10ఎస్‌ ప్రత్యేకతలు

* 6.2–అంగుళాల స్క్రీన్,

* డ్యుయల్‌ రేర్ కెమెరా (13 మెగాపిక్సెల్‌ ప్రైమరీ, 2 ఎంపీ సెకండరీ),

* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా,

* 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Updated : 28 Aug 2019 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top