శాంసంగ్ గెలాక్సీ ఏ31 ధర తగ్గింది.. ఫీచర్లు ఇవే  - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ గెలాక్సీ ఏ31 ధర తగ్గింది.. ఫీచర్లు ఇవే 

July 2, 2020

Samsung Galaxy A31 Price in India

ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్ తన వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మన దేశంలో గెలాక్సీ ఏ31పై భారీ తగ్గింపును ప్రకటించింది. దాదాపు రూ.2 వేల వరకు తగ్గింపును ఇస్తూ ఊరట కల్పించింది. దీంతో ఇప్పటి వరకు రూ. 21,999లకు లభించిన ఫోన్, తాజా ఆఫర్‌తో కేవలం రూ. 19,999కే అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఆ సంస్థ ధరను రూ.1,000 మాత్రమే తగ్గించింది. కానీ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,000 వరకు లాభం చేకూరనుందన్నమాట. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లతో పాటు  శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నెలలోనే విడుదలైన మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఫీచర్స్ ఇవే :   

  • స్క్రీన్ : 6.4 అంగుళాలు
  • కెమెరా : 48,8,5,5 ఎంపీలు కలిగిన నాలుగు కెమెరాలు
  • ఫ్రంట్ కెమెరా : 20 ఎంపీ
  • స్టోరేజీ : 128 జీబీ
  • ఎక్స్టర్నల్ స్టోరేజీ : 512 జీబీ
  • బ్యాటరీ :  5000 ఎంఏహెచ్ 
  • ప్రాసెసర్ : పీ65 
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో