శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల ధరల తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల ధరల తగ్గింపు

November 10, 2019

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన గెలాక్సీ ఏ50ఎస్, ఏ30ఎస్ మోడల్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఏ30ఎస్ మోడల్ ఫోన్‌పై వెయ్యి రూపాయలు తగ్గించగా.. ఏ50ఎస్ మోడల్ ఫోన్‌పై రూ.3వేలు తగ్గించింది. ఏ50ఎస్ 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.22,999 కాగా.. తగ్గింపు తరువాత రూ.19,999కే లభించనుంది. 6జీబీ/128జీబీ వేరియంట్‌ తగ్గింపు అనంతరం రూ.21,999కే దొరుకుతుంది. ఏ30ఎస్ 4జీబీ/64 జీబీ వేరియంట్‌ వెయ్యి రూపాయల తగ్గింపు అనంతరం రూ.15,999కే లభించనుంది. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు, అమెజాన్‌ వెబ్‌సైట్లలో తగ్గింపు ధరలకే ఈ ఫోన్లు లభించనున్నాయి. ఈ ధరలు శాశ్వతంగా తగ్గించినట్లు శాంసంగ్‌ సంస్థ తెలిపింది.

Samsung.

శాంసంగ్‌ గెలాక్సీ  ఏ 50ఎస్ ఫీచర్లు

 

* 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే,

* ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌,

* 48+8+5 ఎంపీల ట్రిపుల్ రేర్ కెమెరాలు,

* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా,

* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,

* 8 ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌,

* ఎన్‌ఎఫ్‌సీ, 

* 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌.

 

శాంసంగ్‌ గెలాక్సీ ఏ 30ఎస్ ఫీచర్లు

 

* 6.4 అంగుళాల హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే,

* ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌,

* 25+8+5 ఎంపీల ట్రిపుల్ రేర్ కెమెరాలు,

* 16 ఎంపీ సెల్ఫీ కెమెరా,

* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,

* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌,

* ఎన్‌ఎఫ్‌సీ,

* 15W ఫాస్ట్‌ చార్జింగ్‌.