శాంసంగ్ గెలాక్సీ ఏ80, ఏ70, ఏ40 వచ్చేశాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ గెలాక్సీ ఏ80, ఏ70, ఏ40 వచ్చేశాయ్

April 10, 2019

వినియోగదారులను అలరించడంలో ఎప్పుడూ ముందుండే శాంసంగ్ మరో మూడు సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఏ 80, ఏ 70, గెలాక్సీ ఏ 40 పేర్లతో  మూడు  స్మార్ట్‌ఫోన్లను బ్యాంకాక్‌లో ఆవిష్కరించింది. బుధవారం నిర్వహించిన శాంసంగ్‌ ఈవెంట్‌లో ఫోన్లను విడుదల చేసింది.

సెల్ఫీ మోడ్‌ సెలెక్ట్‌ చేయగానే ఈ కెమెరా రొటేట్‌ అయ్యే 48 ఎంపీ రొటేటింగ్‌  పాప్‌ అప్‌ కెమెరాతో గెలాక్సీ ఏ 80 స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త టెక్నాలజీతో రానుంది. బ్లాక్‌ గోల్డ్‌, వైట్‌ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. ఇక ఏ 70లో వున్న ప్రత్యేకతలు కూడా ఆకట్టుకుంటున్నాయి. వాటర్‌డ్రాప్‌ డిస్‌ప్లే 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  లాంటి ఫీచర్లు వున్నాయి ఇందులో. ఇది  బ్లాక్‌బ్లూ, వైట్‌ ,పింక్‌ కలర్స్‌లో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ధరలను ఇంకా ప్రకటించలేదు. మే 29న గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను, ఏప్రిల్‌ 26న గెలాక్సీ  ఏ 70ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

గెలాక్సీ ఏ 80 ఫీచర్స్ ఇలా..

48+8+3డీ డెప్త్‌ టీఓఎఫ్‌ ఎంపీ రియర్‌ కెమెరా
6.7 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

1080×2400  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

ఆండ్రాయిడ్‌ 9.0పై
కాల్కం  స్నాప్‌డ్రాగన్‌ 730 జీ ప్రాసెసర్‌
8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌


గెలాక్సీ ఏ 70 ఫీచర్స్ ఇలా..

Image result for samsung galaxy a70


6.7 ఫుల్‌హెచ్‌డీ (వాటర్‌డ్రాప్‌) డిస్‌ప్లే

32ఎంపీ సెల్ఫీ కెమెరా
1080 x 2400  పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌  ప్రాసెసర్‌
32+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

గెలాక్సీ ఏ 40 ఫీచర్స్ ఇలా..

Image result for samsung galaxy a40


 5.9 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

16+5  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
1080 x 2280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

25ఎంపీ సెల్పీ కెమెరా
512 వరకువిస్తరించుకనే అవకాశం
3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, బ్లూ , బ్లాక్‌, కోరల్‌,  వైట్‌ కలర్స్‌లలో

దీని ధర  సుమారు రూ. 19500