6.2 స్ర్కీన్‌తో శాంసంగ్ కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

6.2 స్ర్కీన్‌తో శాంసంగ్ కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవీ..

July 16, 2020

Samsung Galaxy M01s Launched in Indi

సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్ ఫోన్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎం01ఎస్ పేరుతో ఈ 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఫోన్ ను లాంచ్ చేసింది. కేవలం రూ.9,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫోన్ లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఇందులో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను ఏర్పాటు చేశారు. అలాగే 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. దీనిలో ఉండే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ రోజంతా బ్యాకప్ ఇస్తుందని శాంసంగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ ను శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే రిటైల్ స్టోర్ లలోకి కూడా రానుందని శాంసంగ్ సంస్థ తెలిపింది.

 

శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్లు..

* 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్,

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,

* 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, 

* ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం,

* 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్,

* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.