శాంసంగ్ M31 మార్కెట్లోకి వచ్చేసింది..ఫీచర్స్ ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ M31 మార్కెట్లోకి వచ్చేసింది..ఫీచర్స్ ఇవే

February 25, 2020

Samsung

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ M31 పేరుతో రెండు వేరియంట్లలో ఫోన్ తయారు చేశారు. సరికొత్త ఫీచర్లతో దీన్ని రూపొందించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. మార్చి ఐదో తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల‌లో వీటిని అందుబాటులోకి ఉంచనున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద దీనిపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, అతి పెద్ద బ్యాటరీ, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ వంటి ఫీచర్లు దీంట్లో జోడించారు. 64 జీబీ ఇన్‌బుల్ట్ మెమోరి ఫోన్ ధర రూ. 15,999 కాగా 128 జీబీ ఇన్‌బుల్ట్ మెమొరీ ఫోన్ ధర రూ.16,999 మాత్రమే. వీటిలో ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 తగ్గించారు. 

శాంసంగ్ M31 ఫీచర్లు : 

  • స్క్రీన్ : 6.4 అంగుళాలు
  • బ్యాటరీ : 6,000 MAH
  • ర్యామ్ : 6 జీబీ
  • స్టోరేజీ : 64 జీబీ, 128జీబీ 
  • మైక్రోఎస్డీ కార్డు : 512 జీబీ వరకు 
  • కెమెరా : 64 ఎంపీ+8ఎంపీ, 5ఎంపీ+5ఎంపీ 
  • సెల్ఫీ కెమెరా :  32 ఎంపీ