64ఎంపీ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫీచర్లు, ధరలు ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

64ఎంపీ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫీచర్లు, ధరలు ఇలా.. 

July 30, 2020

Samsung Galaxy M31s India Launch Today at 12 Noon

స్మార్ట్ ఫోన్ తయారీలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ దూకుడు పెంచింది. వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను లాంచ్ చేస్తోంది. తాజాగా గెలాక్సీ ఎం31ఎస్ పేరుతో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్, సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఆగస్ట్ 6న ‌ఫోన్ సేల్ కి రానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ మిరేజ్ బ్లూ, మిరేజ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. ఇక ధరల విషయానికి వస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.19,499 నిర్ణయించగా.. 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.21,499కి లభ్యం కానుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ఫీచర్లు

* 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే,

* 6జీబీ/8జీబీ ర్యామ్,

* 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* ఎక్సినోస్ 9611 ప్రాసెసర్,

* 64+12+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,

* 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 6,000ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్,