Samsung Galaxy M52 5G Gets Up To Rs. 10,000 Price Cut In India
mictv telugu

శాంసంగ్ ‘ఎం52 5జీ’.. ఏకంగా రూ.10,000 తగ్గింపు

June 23, 2022

Samsung Galaxy M52 5G Gets Up To Rs. 10,000 Price Cut In India

మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభవార్త. శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపు ధరలో లభిస్తుంది. ఎమ్(M) సిరీస్ లో భాగంగా గత ఏడాది లాంచ్‌ చేసిన మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ‘ఎం52 5జీ’ ధరను 10వేల రూపాయలు తగ్గించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్‌ లభించనుంది వినియోగ‌దారుల నుంచి మంచి రేటింగ్ పొందిన ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ సూపర్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 64MP+12MP+5MP ట్రిపుల్ రియర్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను క‌లిగి ఉంది. దీని అసలు ధర రూ. 29,999గా ఉండగా.. ప్రస్తుతం రిలయన్స్‌ డిజిటల్‌ ద్వారా రూ.20,999 లకే లభిస్తోంది. ఇదే వేరియంట్‌ ధర అమెజాన్‌లో రూ. 24,999 గా ఉంది.

మిగితా ఫీచర్లు ఇవే:

• 1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
• క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 778G SoC
• 5000 mAh బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్‌
• USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్