samsung galaxy s21 se getting huge discount of 55000 rupees full details here
mictv telugu

రూ. 70వేల ఫోన్ రూ. 20వేలకే…ఫ్లిప్‎కార్ట్ సేల్‎లో ఇదే హైలేట్..!!

January 25, 2023

సామ్‎సంగ్ భారత్‎లో ప్రముఖ బ్రాండ్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ తన అన్‎ప్యాక్డ్ ఈవెంట్ కోసం వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 1న జరగనున్న ఈ ఈవెంట్లో కంపెనీ తన కొత్త ప్రీమియం సిరీస్ ను లాంచ్ చేయనుంది. అయితే రూ. 20వేల కంటే తక్కువ ధరకే మీరు సొంతం చేసుకునే మరో ప్రీమియం ఫోన్ గురించి మీరు తెలుసుకోవల్సిందే. సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్21ఎస్ఈ ఫ్లిప్ కార్డులో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ధర:
ఫ్లిప్ కార్టులో సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఈ 128జిబి రిటైల్ ధర రూ. 74999. కానీ మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్ 46% తగ్గింపును పొందవచ్చు. అంటే మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ. 35000 తగ్గింపును పొందుతున్నారు. ఇదే కాకుండా, మీరు రూ. 39999 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగిస్తే, మీరు భారీ తగ్గింపును కూడా పొందవచ్చు.

ఆఫర్లు:
మీరు ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ లేకుండా కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. మీరు ఈ ఫోన్‌పై చాలా మంచి ఆఫర్‌లను పొందవచ్చు. మీరు నాన్-ఎక్స్ఛేంజ్ ఎంపికను ఎంచుకున్నప్పుడు, మీకు రూ. 20,000 వరకు తగ్గింపు ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ లేకుండా కూడా రూ.20,000 లోపే కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు:
సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే, Exynos 2100 చిప్‌సెట్, 12మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ప్రైమరీ లెన్స్, 12మెగాపిక్సెల్ వైడ్ లెన్స్, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో మీకు 5G సపోర్ట్ కూడా లభిస్తుంది.