Samsung Galaxy S23 pre-orders open in India
mictv telugu

సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-ఆర్డర్స్ షురూ. ప్రీ-రిజర్వ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఇవే..!

January 13, 2023

Samsung Galaxy S23 pre-orders open in India

సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్ 23 ప్రీ బుకింగ్స్ షురూ అయ్యాయి. సామ్‎సంగ్ వెబ్ సైట్ ద్వారా ప్రీ రిజర్వ్ చేసుకునేవారికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ విడుదల డేట్, సమయం వివరాల గురించి తెలుసుకుందాం.

సామ్‎సంగ్ ఫ్లాగ్‎షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్23 త్వరలోనే మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 1వ తేదీని సామ్‎సంగ్ ఎస్23 సిరీస్ విడుదల కానుంది. గెలాక్సీ అన్‎ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ఈ సిరీస్ ప్రీమియం ఫోన్లను సామ్‎సంగ్ రిలీజ్ చేయనుంది. అయితే ఇప్పటికే సామ్‎సంగ్ ప్రీ బుకింగ్స్‎ను ప్రారంభించింది. ఈ సిరీస్ ఫోన్లను కొనుగోలుచేయానుకునేవారు ఇప్పుడు రూ. 1999 రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో కొన్ని బెనిఫిట్స్ కూడా పొందుతారు.

సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23 లాంచ్ ఎప్పుడంటే..
ఫిబ్రవరి 1వ తేదీన సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23 ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఈవెంట్లోనే ఎస్23 సిరీస్ ఫోన్లు రిలీజ్ అవుతాయి. ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించనుంది. ఈ సిరీస్ లో మూడు మొబైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23, సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23ప్లస్, సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఉన్నాయి.

ప్రీ -బుకింగ్ బెనిఫిట్స్
సామ్‎సంగ్ అధికారిక వెబ్‎సైట్ ద్వారా రూ. 1999చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకుంటే రూ. 5000వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. ప్రీ రిజర్వ్ చేసుకున్నవారికి ఎస్ 23 సిరీస్ లోని ఎక్స్‎క్లూజివ్ కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు రూ. 2000విలువైన వెల్‎కమ్ వౌచర్ కూడా లభిస్తుంది. ముందస్తు డెలివరీ ఉంటుంది.

స్పెసిఫికేషన్లు
సామ్‎సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‎లోని మూడు మొబైళ్లు ఫ్లాగ్‎షిప్ రేంజ్‎లో ఉండనున్నాయి. ఇందులో గెలాక్సీ ఎస్23 అల్ట్రా మరింత ప్రీమియంగా ఉంటుంది. ఎస్23 అల్ట్రా మోడల్ బ్యాక్ సైడ్ 200మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మిగతా రెండింటిలో బ్యాక్ 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మొత్తం ఈ మూడు ఫోన్లు ఫ్లాగ్‎షిప్ సెన్సార్లతో ఉన్న కెమెరాలతో రానున్నాయి. క్వాల్‎కామ్ లేటెస్ట్ పవర్‎ఫుల్ స్నాప్‎డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ ఫోన్లలో ఉంటాయి. ఇక ఫిబ్రవరి 1న లాంచ్ ప్రొగ్రామ్‎లో గెలాక్సీ ఎస్23కి సంబంధించి మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది.