శాంసంగ్ నుంచి మరో మడత ఫోన్.. ధర ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ నుంచి మరో మడత ఫోన్.. ధర ఎంతో తెలుసా?

September 2, 2020

Samsung Galaxy Z Fold Phone

ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ మరో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2’ పేరుతో మడత ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2020 ఈవెంట్ భాగంగా దీన్ని తీసుకువచ్చారు. అమెరికా, దక్షిణ కొరియా సహా 40 దేశాల్లో దీనికి సంబంధించిన అమ్మకాలు సెప్టెంబర్ 18వ తేదీ  నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ ధరను అమెరికాలో 1,999 డాలర్లుగా(రూ.1,48,300)గా నిర్ణయించారు. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ రంగుల్లో ఇవి మార్కెట్లో కనిపించనున్నాయి. ఫోల్డ్ ఫోన్ల విభాగంలో ఆ సంస్థ నుంచి ఇది మూడో ఫోన్ కావడం విశేషం. అయితే మన దేశంలో మాత్రం ఎప్పుడు ప్రవేశపెడతారనేది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

ఫీచర్లు ఇవే : 

స్క్రీన్ :  7.6 అంగుళాలు ఫోల్డబుల్ డైనమిక్ ఎల్ఈడీ 

ర్యామ్ : 12 జీబీ 

స్టోరేజ్ : 256 జీబీ

బ్యాక్ కెమెరా : 12 ఎంపీ,12 ఎంపీ వైడ్ యాంగిల్,12 ఎంపీ టెలిఫొటో లెన్స్ 

సెల్పీ కెమెరా : 10 ఎంపీ

బ్యాటరీ : 4,500 ఎంఏహెచ్

వైర్ లెస్ చార్జర్