కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా. అయితే మంచి బ్రాండ్ కోసం వెతుకుతున్నారా. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో శాంసంగ్ ఒక క్వాలిటీ బ్రాండ్. శాంసంగ్ అనేక క్వాలిటీ 5జీ మొబైల్స్ ను విడుదల చేస్తోంది. ప్రస్తుతం కొత్త సంవత్సరం మార్కెట్లో విడుదల కానున్న గురించి 5G స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
శాంసంగ్ కొత్త సంవత్సరంలో గెలాక్సీ A సిరీస్ నుండి రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్లను భారతదేశంలో జనవరి నెలలోనే విడుదల చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A14 5G, అలాగే గెలాక్సీ A23 5జీ పేరుతో 2 కొత్త స్మార్ట్ఫోన్లను జనవరిలో పరిచయం చేయబోతోంది. ఈ రెండు ఫోన్ ల ధరలు సుమారుగా రూ. 15,000 నుండి ప్రారంభమవుతున్నాయి. ఫోన్ ధరతో పాటు కొన్ని ఫీచర్ల గురించి కూడా సమాచారం తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫీచర్స్ :
డిజైన్:
నివేదిక ప్రకారం, ఈ ఫోన్ డిజైన్ శాంసంగ్ గెలాక్సీ A22 ఫ్లాట్ ఫ్రేమ్‌ని పోలి ఉంది. ఈ ఫోన్ డిజైన్‌లో పవర్ బటన్. వాల్యూమ్ బటన్‌ను కుడి వైపున ఉన్నాయి.. ఫోన్ ముందు కెమెరాను నాచ్ డిస్ప్లేలో తయారు చేశారు.
డిస్ ప్లే :
ఈ ఫోన్లో 6.5-అంగుళాల ఎల్సిడి డిస్ప్లేను చూడవచ్చు. ఇందులో 90 HZ రిఫ్రెష్ రేట్ ఇవ్వవచ్చు.
కెమెరా :
శాంసంగ్ఈ ఫోన్లో వృత్తాకార రింగ్లలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తోంది. ఈ సెటప్‌లో 50మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా , మరో రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. దీనితో పాటు, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటాయి..
బ్యాటరీ:
ఈ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఓఎస్:
ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ యూఐ 5.0తో పని చేసే చాన్స్ ఉంది.
నెట్వర్క్:
కంపెనీ ఈ ఫోన్‌ను 5G నెట్‌వర్క్‌తో మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు:
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వై-ఫై, 3.5ఎంఎం జాక్, డ్యూయల్ సిమ్ , బ్లూటూత్ వంటి అన్ని ఫీచర్లను ఫోన్ విడుదల చేయబోయే ఫోన్లో ఉంటాయని భావిస్తున్నారు.
శాంసంగ్ A23 5జీ ఫీచర్లు :
డిస్ ప్లే :
ఈ శాంసంగ్ ఫోన్ 5.8 అంగుళాల స్క్రీన్‌పై HD + డిస్ప్లేను కలిగి ఉంది. రిజల్యూషన్ ఫోన్లో 720 x 1560 పిక్సెల్‌లలో లభిస్తుంది.
ప్రాసెసర్:
కంపెనీ ఎక్సినోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేసింది.
ర్యామ్ ,మెమరీ- ఈ ఫోన్ గరిష్టంగా 8 జీబీ ర్యామ్ , 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. కాబట్టి మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఫోన్ మెమరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 50మెగాపిక్సెల్ ఫ్రంట్ మెయిన్ బ్యాక్ కెమెరా, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ డెప్త్ కెమెరా , 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ మాత్రమే ఫ్లాష్‌లైట్ ఉన్న మాక్రో కెమెరా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఓఎస్- ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తోంది.
రంగు:
ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, నీలం , పీచ్ రంగులలో వస్తుంది.
ఇతర ఫీచర్లు:
ఈ ఫోన్లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, 3.5 ఎంఎం జాక్ , వై-ఫై వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.