ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో అతి చవకైన 5జీ ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 గా పిలువబడే ఈ ఫోన్లో 50 ఎంపి కెమెరా, 8 ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి సదుపాయాలున్నాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో అక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగులలో ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1పై ఈ మోడళ్లు నడుస్తాయి. ఈ మొబైల్‌కు రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక 4జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 15,999, 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ. 17,499 లుగా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్డ్‌లో కూడా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొన్న వారికి వెయ్యి రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో 4జీబీ ర్యామ్ మోడల్ రూ. 15000 లకే దొరుకుతుంది.