శాంసంగ్‌ 5జీ మడత ఫోన్‌ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్‌ 5జీ మడత ఫోన్‌ వచ్చేసింది..

November 20, 2019

దక్షిణకొరియాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్‌ సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఇప్పటికే గెలాక్సీ ఫోల్డ్ పేరుతో ఒక మడత ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శాంసంగ్ డబ్ల్యు 20 5జీ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. 

ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీ ఫోల్డ్‌ మాదిరిగా ఉంచింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు, డాల్బీ అట్‌మాస్‌ సపోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరోస్కోప్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది. డిసెంబరు నుంచి ఈ ఫోన్ చైనాలో అందుబాటులోకి రానుంది. ధర వివరాలు శాంసంగ్ ప్రకటించాల్సిఉంది.

Samsung.

శాంసంగ్ డబ్ల్యూ 20 5జీ ఫీచర్లు 

 

* 840×1960 పిక్సెల్స్ రిజల్యూషన్ ,

* 4.6 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ ప్లే,

* ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌,

* 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌,

* 16+12+12 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా,

* 10+8 ఎంపీ డబుల్‌ సెల్ఫీ కెమెరా,

* 4235 ఎంఏహెచ్‌ బ్యాటరీ.