శాంసంగ్ ‘ది వాల్‌’ టీవీ...ధర రూ.12కోట్లే!  - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ ‘ది వాల్‌’ టీవీ…ధర రూ.12కోట్లే! 

December 8, 2019

SAMSUNG 01

ది వాల్ అనగానే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గుర్తుకు వస్తారు. ఇదే పేరుతో టెక్ దిగ్గజం శాంసంగ్ భారీ టీవీలను ఆవిష్కరించింది. ఈ టీవీలు 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల స్క్రీన్‌తో లభించనున్నాయి. ఈ టీవీలు మైక్రో ఎల్‌ఈడీ, 6కే డెఫినిషన్, 8 కే డెఫినిషన్‌ మూడు వేరియంట్లలో లభించనున్నాయి. వీటి ధర రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల దాకా ఉండనుంది. 

విలాసవంతమైన అనుభూతి కోరుకునే వారి కోసం వీటిని రూపొందించినట్లు శాంసంగ్‌ ఇండియా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేఠి తెలిపారు. ఇండియాలోని అత్యంత సంపన్న వర్గాలు లక్ష్యంగా ఈ టీవీలు ఆవిష్కరించినట్లు తెలిపారు. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. టీవీ చూడనప్పుడు ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా..పెయింటింగ్‌లు, ఫొటోలు వంటి వాటిని నిరంతరం డిస్‌ప్లే చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.